తమన్నా చేతికి ఖరీదైన డైమండ్ రింగ్.. ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

తమన్నా చేతికి ఖరీదైన డైమండ్ రింగ్.. ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

స్టార్ హీరోయిన్ తమన్నా(Thamannaah) గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎదో ఒకరకంగా ట్రేడ్ అవుతూనే ఉంది. ఇటీవల ఆమె చేసిన రెండు బాలీవుడ్ వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ నుండి చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది ఈ బ్యూటీ. కెరీర్ లో ఎన్నడూ లేనంత విదంగా ఈ రెండు సిరీస్ లలో చాలా బోల్డ్ గా కనిపించింది తమన్నా. 

ఇక రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న జైలర్(Jailer) నుండి కావాలయ్య(Kaavalayya) అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటలో తమన్నా డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యినిదంటే.. షార్ట్స్, రీల్స్, సోషల్ మీడియా ఎక్కడ చూసిన ఈ సాంగ్ ఏ వినిపిస్తోంది. 

ALSO READ:కంగనా ఇంట్లో త్వరలో బేబీ రనౌత్.. ఫొటోస్ వైరల్

ఇక తాజాగా మరో న్యూస్ తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ ఆవుతోంది తమన్నా. అదేంటంటే.. రీసెంట్ గా తమన్నా తన చేతికి డైమండ్ రింగ్ ధరించి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యింది. దాదాపు రూ.2 కోట్ల విలువ ఉండే ఈ డైమండ్ ను ఆమెకు ఒక ప్రత్యేకమైన ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారట. ప్రపంచంలోనే అరుదుగా కనిపించే డైమండ్ రింగ్ తో ఇప్పుడు తమన్నా మరోసారి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ రింగ్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.