సుప్రీంకోర్టులో కంగనాకు చుక్కెదురు.. వెనక్కి తగ్గిన బాలీవుడ్ నటి!

సుప్రీంకోర్టులో కంగనాకు చుక్కెదురు.. వెనక్కి తగ్గిన బాలీవుడ్ నటి!

బాలీవుడ్  నటి, లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్ కు సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. 2021 రైతు ఉద్యమం సందర్భంగా వృద్ధురాలు మహిందర్ కౌర్ పై చేసిన వ్యాఖ్యల కేసును రద్దు చేయాలని ఆమె వేసిన పిటిషను ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు "మీరు కేవలం రీట్వీట్ మాత్రమే చేయలేదు, దానికి మసాలా కూడా జోడించారు" అని వ్యాఖ్యానించారు.

తొలుత జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం  కంగనా రనౌత్ ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి విముఖత చూపింది. విచారణ కోర్టులో ప్రత్యామ్నాయ పరిష్కారాలను వెతుక్కోవాలని సూచించడంతో, కంగనా రనౌత్ తరపు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసు మొదట పంజాబ్, హర్యానా హైకోర్టులో విచారణకు వచ్చింది. కంగనా చేసిన పోస్ట్ సద్భావనతో కూడినది కాదని, అందులో పరువు నష్టం కలిగించే అంశాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో కంగనా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

►ALSO READ | రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన బాలీవుడ్ నటి.. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స.. అసలేం జరిగిందంటే?

కంగనా అప్పట్లో మహిందర్ కౌర్ ను షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ బానో అని అభివర్ణిస్తూ.. "రూ.100కి నిరసనలకు వచ్చేదాదీ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ తన గౌరవాన్ని దెబ్బతీసిందని, తాను రైతు ఉద్య
మంలో ప్రారంభం నుంచీ పాల్గొంటున్నానని మహిందర్ కౌర్ పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో మహీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కంగనాపై కేసు నమోదైంది. హైకోర్టు కూడా ఇదే కేసులో కంగనా వాదనలను తిరస్కరించిన సంగతి తెలిసిందే.