నాకు రాజకీయాల్లోకి రావాలనే ఉంది.. కానీ.. 

నాకు రాజకీయాల్లోకి రావాలనే ఉంది.. కానీ.. 

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో గరంగరం ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉంటుంది. వర్తమాన రాజకీయాలపై కంగన తనదైన స్టయిల్‌‌లో కామెంట్లు చేస్తూ ఉంటుంది. అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీపై మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా దీని గురించి ఆమె నోరు విప్పింది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్ తలైవిలో నటిస్తున్న కంగన.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌‌లో రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. 

సోషల్ మీడియాలో తాను చేసే పోస్టులకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కంగన క్లారిటీ ఇచ్చింది. ‘నాకు రాజకీయ ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. కానీ దేశభక్తి, రైతుల నిరసనలు, కొత్త వ్యవసాయ చట్టాలు గురించి తెలుసు. అవి నేరుగా నాపై ప్రభావం చూపుతాయి. నాకు రాజకీయ నేత అవ్వాలని ఉంది. కానీ అది అందరూ అనుకుంటున్నట్లుగా ఉండదు. ఓ సిటిజన్‌‌గా అన్ని విషయాలపై స్పందిస్తా. కానీ నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. నేను దేశభక్తి గురించి మాట్లాడటం చాలా మందికి రుచించదు. అలాగే సాగు చట్టాల గురించి మాట్లాడుతున్నా కొందరికి కోపం వస్తోంది. కానీ నేను మాట్లాడటం ఆపబోను’ అని కంగన పేర్కొంది.