
ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటనతోపాటు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆమె చేసే పలు పోస్టులపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంటాయి. అలాంటి కంగనా అకౌంట్‌ను ట్విట్టర్ తొలగించింది. రూల్స్‌ను అతిక్రమించిందనే కారణంతో ఆమె అకౌంట్‌ను ట్విట్టర్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి కంగన చేసిన ట్వీట్లు రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే ఆమె అకౌంట్‌ను ట్విట్టర్ తొలగించినట్లు తెలిసింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి.. ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని ప్రధాని మోడీని కోరుతూ కంగన ట్వీట్ చేసింది. దీదీ ఓ దెయ్యమంటూ కామెంట్ చేసింది. మోడీ తన విరాట్ రూపాన్ని ప్రదర్శించి బెంగాల్‌లో ఎమర్జెన్సీ విధించాలని విజ్ఞప్తి చేసింది.