కంగువా మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

కంగువా మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సూర్య.  ప్రస్తుతం ‘కంగువా’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.  ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్‌‌ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా మంగళవారం టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

ఇందులో  సూర్య  పోరాట యోధుడి క్యారెక్టర్‌‌‌‌లో సర్‌‌‌‌ప్రైజ్ చేశాడు. పులితో చేసిన ఫైట్ సీక్వెన్స్ ఆకట్టుకుంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్‌‌తో సరికొత్త ప్రపంచాన్ని డిజైన్ చేసినట్టుగా ఉన్న టీజర్ విజువల్ వండర్‌‌‌‌గా  సాగింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు సినిమాపై ఆసక్తిని పెంచింది. సూర్య కెరీర్‌‌‌‌లో ఇది 42వ చిత్రం. తనకు జంటగా దిశాపటానీ నటిస్తుండగా బాబీడియోల్ కీ రోల్‌‌ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా పది భాషల్లో  త్రీడీ ఫార్మట్‌‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేయనున్నారు.