Murder Mystery Thriller: ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ..రియ‌లిస్టిక్ అంశాల‌కు థ్రిల్ అవ్వాల్సిందే!

Murder Mystery Thriller: ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ..రియ‌లిస్టిక్ అంశాల‌కు థ్రిల్ అవ్వాల్సిందే!

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌‌బస్టర్ హిట్‌‌ కొట్టిన సినిమా శాఖాహారి. కోటి రూపాయ‌‌ల కంటే తక్కువ బ‌‌డ్జెట్‌‌తో తెర‌‌కెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అదే సినిమా ఇప్పుడు తెలుగు ఓటీటీలోకి వచ్చింది.

చిన్న సినిమాగా రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన శాఖాహారి మూవీ తెలుగులోకి వ‌చ్చింది. తెలుగు వెర్ష‌న్ బుధ‌వారం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ స‌బ్‌టైటిల్స్‌తో తెలుగు వెర్ష‌న్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీని సందీప్ సుంకడ్ టేకింగ్ అండ్ మేకింగ్ కి హీరో యాక్టింగ్ అదిరిపోయింది. ఈ సినిమా థియేట‌ర్ల‌లో యాభై రోజుల‌కుపైగా ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ గ నిలిచింది. ఆలస్యం ఎందుకు చూసేయండి.  

ALSO READ | Anasuya Bharadwaj: అపుడు మెసేజ్ ఇవ్వాల‌నుకున్నా..విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో వివాదంపై అన‌సూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

కథలోకి వెళ్తే.. సుబ్బన్న (రంగాయ‌‌ణ ర‌‌ఘు) ఒక చిన్న టౌన్‌‌లో వెజిటేరియన్‌‌ హోట‌‌ల్ న‌‌డుపుతుంటాడు. మ‌‌ధ్య వ‌‌య‌‌స్కుడైన సుబ్బన్న పెళ్లి చేసుకోకుండా, ఎలాంటి బంధాలు లేకుండా బతికేయాలి అనుకుంటాడు. సుబ్బన్న హోటల్‌‌ నడుపుతున్న పక్క టౌన్‌‌లో మల్లికార్జున్‌‌(గోపాల‌‌కృష్ణ దేశ్‌‌పాండే) ఎస్సైగా పనిచేస్తుంటాడు.

అతను కొన్ని కారణాల వల్ల అక్కడినుంచి ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ కోసం అప్లికేషన్ పెట్టుకుంటాడు. కానీ.. అదే టైంలో హత్య కేసులో నిందితుడిగా గుర్తించి అరెస్ట్‌‌ అయిన విజయ్‌‌ (విన‌‌య్ యు.జె.) పోలీస్‌‌స్టేషన్‌‌ నుంచి తప్పించుకుంటాడు. అక్కడి నుంచి విజయ్‌‌ నేరుగా సుబ్బన్న దగ్గరికెళ్లి, అతని హోటల్‌‌లో తల దాచుకుంటాడు. విజయ్‌‌ని వెతుక్కుంటూ మల్లికార్జున్‌‌ సుబ్బన్న హోటల్‌‌కు వస్తాడు. అక్కడ సుబ్బన్న గురించి కొన్ని షాకింగ్ విష‌‌యాలు తెలుస్తాయి. అవేంటి? ఫ్లాష్‌‌బ్యాక్‌‌లో సుబ్బన్న ఏం చేసేవాడు? అనేదే మిగతా సినిమా.