పునీత్ ‘సివిల్ ఇంజినీర్’ ట్రైలర్ రిలీజ్

పునీత్ ‘సివిల్ ఇంజినీర్’ ట్రైలర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘చక్రవ్యూహ’ తెలుగులో ‘సివిల్ ఇంజినీర్’ పేరుతో విడుదల కానుంది. నవంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  దీపావళి పండుగ సందర్భంగా  మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 

దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కన్నడంలో 2016లో విడుదలై  సూపర్ డూపర్ హిట్ గా నిలిచించి. బాక్సాఫీసు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఎం.శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ సరసన రుచితా రామ్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీత స్వరాలు అందించిన ఈ సినిమాలో హీరో పునీత్ లోహిత్ పాత్రలో అలరించాడు. అరుణ్ విజయ్, అభిమన్యు సింగ్, భవ్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘గంధదగుడి’ ఈనెల 28న విడుదలకానుంది. ఇదే క్రమంలో పునీత్ కు తెలుగు చిత్రపరిశ్రమతో ఉన్న అనుబంధం.. మార్కెట్ నేపథ్యంలో ‘చక్రవ్యూహ’ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.