
మంచు విష్ణు హీరోగా ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కన్నప్ప పాత్రలో విల్లు ఎక్కుపెట్టి కనిపించాడు మంచు విష్ణు. పాత్రలోని ధైర్యం, ఇంటెన్సిటీ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా న్యూజిలాండ్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయబోతున్నారు.