ఆడియన్స్ అలర్ట్: ఈసారి వెలుగు కాదు ఏకంగా దర్శనమే!

ఆడియన్స్ అలర్ట్: ఈసారి వెలుగు కాదు ఏకంగా దర్శనమే!

కాంతార(Kantara)… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాల్లో ఒకటి. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ కన్నడ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర   రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ కాసుల వర్షం కురిపించింది కాంతార మూవీ. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా అందుకుంది.

దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కాదు.. కాదు.. ప్రీక్వెల్ ను ప్రకటించాడు దర్శకుడు రిషబ్ శెట్టి. దీంతో ఈ ప్రీక్వెల్ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుంది అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురుచూపులు పులిషాట్ప్ పెట్టేసే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.. ఈసారి కేవలం వెలుగు మాత్రమే కాదు ఏకంగా దర్శనమే.. అంటూ కాంతార2 మూవీ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. 

కాంతార చాఫ్టర్1 మూవీ ఫస్ట్ లుక్ ను నవంబర్ 27న మధ్యాహ్నం 12:25 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార సినిమాలో చూపించిన మొదటి 20 నిమిషాల  ముందు జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకే ఈ సినిమాను సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ అని పిలుస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచలాను భారీగా పెరుగుతున్నాయి. ఇక కాంతార ప్రీక్వెల్ కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు మేకర్స్. పార్ట్ 1 కోసం కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన మేకర్స్.. ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరి భారీ బడ్జెట్ తో.. చాలా ప్రత్యేకతలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.