
‘మన ఊరు- మన బడి’ సక్సెస్ చేయాలి : డీఈవో రమేశ్
నర్సాపూర్, వెలుగు : ‘మన ఊరు మనబడి’ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని డీఈవో రమేశ్ సూచించారు. నర్సాపూర్ జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో శనివారం నిర్వహించిన మండల స్థాయి రివ్యూ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ‘ మన ఊరు మన బడి’ కి ఎంపికైన స్కూళ్లలో జరుగుతున్న పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. డీఈవో మాట్లాడుతూ పనులను వేగంగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మండలంలోని5 స్కూళ్లలో డిసెంబర్ 31 వరకు పనులు పూర్తవుతాయని, మిగిలిన స్కూళ్లలో ఫిబ్రవరిలోగా పూర్తి చేస్తామని డీఈవో తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని హనుమంతపూర్ గవర్నమెంట్ స్కూల్‌ను విజిట్ చేసి ‘తొలి మెట్టు’ కార్యక్రమాన్ని పరిశీలించారు. డీఈఈ రాధిక లక్ష్మి, ఎస్వో సుభాష్, ఎంఈవో బుచ్చ నాయక్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జనవరి 18 నుంచి ‘కంటి వెలుగు’
సిద్దిపేట, వెలుగు: జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ ప్రారంభించనున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సోమవారం క్యాంప్‌ఆఫీస్‌లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేసుకున్న 300 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ కంటిచూపు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని పైసా ఖర్చు లేకుండా క్యాటారాక్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నామని తెలిపారు. అంతకు ముందు శరభేశ్వర ఆలయ సమీపంలో భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కోసం శ్రామిక్ సంధాన్ యాప్ ను మంత్రి ఆవిష్కరించారు. ఎస్ఎంహెచ్ హాస్టల్ ఆవరణలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి , రూరల్పీఎస్ఆవరణలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, బాల రక్షా భవన్ నిర్మాణానికి హరీశ్‌రావు భూమి పూజ చేసి, బ్రాహ్మణ పరిషత్ బిల్డింగ్‌ను ప్రారంభించారు.
వడ్ల కొనుగోళ్ల పై సమీక్ష
జిల్లాలో వడ్ల కొనుగోళ్ల పై మంత్రి హరీశ్ క్యాంప్‌ఆఫీస్‌లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలసి రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ. 619 కోట్ల విలువైన 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. రూ.544 కోట్లు రైతులకు చెల్లించామని, ఇంకా రూ. 65 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. పదిరోజుల్లో 100 శాతం వడ్లు కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి ఆఫీసర్లను ఆదేశించారు.
‘మన ఊరు-మన బడి’ పనులు స్పీడప్ చేయాలి
సిద్దిపేట జిల్లాలో ‘మన ఊరు -మనబడి’ పనులు స్పీడప్చేయాలని ఇంజినీర్లను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 343 స్కూళ్ల పునరుద్ధరణకు గానూ, ఇప్పటి వరకు 239 స్కూళ్లు గ్రౌండింగ్ పూర్తయిందని ఆఫీసర్లు రివ్యూ మీటింగ్‌లో మంత్రికి వివరించారు. టెన్త్రిజల్ట్స్లో జిల్లాను ఫస్ట్ ప్లేస్‌లో నిలపాలని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి మంత్రి ఆదేశించారు.
పోడు రైతులకు న్యాయం చేయాలి : కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్ , వెలుగు: అర్హులైన పోడు రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో పోడు భూముల జిల్లా కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లాలో ‘పోడు’ రైతులకు హక్కు పత్రాలిచ్చేందుకు జిల్లా కమిటీకి 587 అప్లికేషన్లకు గాను 987.08 ఎకరాలు ఇవ్వాలని ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు. అందులో 481 క్లెయిమ్స్ ను పరిశీలించి 981.37 ఎకరాల ల్యాండ్‌కు పత్రాలిచ్చేందుకు ఆమోదం తెలిపి , ప్రభుత్వానికి సిఫారసు చేశామన్నారు. డివిజినల్లెవల్లో క్లెయిమ్స్ అన్నింటిని మరోసారి పరిశీలించి అర్హుల జాబితాను జిల్లా కమిటీకి పంపాలని ఆర్డీవోలను కలెక్టర్ఆదేశించారు. అడిషనల్కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా ఫారెస్ట్ఆఫీసర్శ్రీధర్ రావు, ఎస్టీ వెల్ఫేర్ఆఫీసర్ఫిరంగి, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
‘ఆధార్’ అప్డేట్ చేసుకోవాలి
మెదక్ టౌన్, వెలుగు : ఆధార్‌కార్డును అప్డేట్చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, పదేళ్ల కింద ఆధార్ తీసుకున్న వారు వెంటనే అప్డేట్చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ ఫస్ట్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్డేట్లో సలహాలు, సాయం కోసం ‘1947’ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు. help@uidai.gov.in మెయిల్ఐడీ ద్వారా కూడా సాయం పొందవచ్చని వివరించారు. జిల్లాలో విద్య, వైద్య, పోస్టల్, బ్యాంకింగ్ విభాగాల్లో ఆధార్ నమోదుకు 75 కిట్స్ అందజేశామని, మెషీన్లలో సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలని చెప్పారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ‘ఆధార్’ పేరుతో జరిగే మోసాలపై ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు కంప్లైంట్చేయాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ వేణు గోపాల్ రావు, డాక్టర్ నవీన్ పాల్గొన్నారు.
గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గం: బీజేపీ నేత బాబుమోహన్
మునిపల్లి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులు కూడా రాష్ట్రం నిధులతోనే చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమని బీజేపీ నేత బాబు మోహన్ విమర్శించారు. ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా సోమవారం మండల పరిధిలోని కంకోల్, లింగంపల్లి, మొగ్దుంపల్లి, బొడశట్పల్లి, మేళసంగం, అంతారం, పెద్దచెల్మెడ, మన్సన్పల్లి, తాటిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ‘అందోల్ ’ అభివృద్ధి చెందిందన్నారు. గతంలో దామోదర రాజనర్సింహ్మ, ప్రస్తుతం చంటి క్రాంతికిరణ్నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.
సంగ్రామ సభను సక్సెస్చేయాలి
పటాన్చెరు, వెలుగు: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదోవిడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభను సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం గుమ్మడిదలలో పార్టీ కార్యకర్తలతో మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల15న కరీంనగర్ లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెల అభివృద్ధి
దుబ్బాక, వెలుగు: దేశాభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలని, పల్లెల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాక మండలం రఘోత్తంపల్లి లో తన సొంత ఫండ్స్‌తో నిర్మించిన హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్రం వాటా ఉంటుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పల్లెల అభివృద్ధి కుంటుపడిందని, మారుమూల పల్లెల అభివృద్ధి ని సామాజిక బాధ్యతగా భావించి ప్రజలు నడుం బిగించాలని కోరారు. అనంతరం గ్రామానికి చెందిన మారెపు శంకరయ్య అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే బాధిత కుటంబాన్ని పరామర్శించారు. సర్పంచ్దేవిరెడ్డి, బీజేపీ లీడర్లు మట్ట మల్లారెడ్డి, మచ్చ శ్రీనివాస్, కొండి ఎల్లారెడ్డి, నేహాల్గౌడ్ పాల్గొన్నారు.