సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లు వందేండ్లకు ఒక్కసారి మాత్రమే వస్తారు:కపిల్ దేవ్

సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లు వందేండ్లకు ఒక్కసారి మాత్రమే వస్తారు:కపిల్ దేవ్

లంకతో జరిగిన మూడో టీ20లో అద్భుత సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన  సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతని ఆటకు, షాట్లకు తాజా క్రికటర్లే కాదు..మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారు. సూర్యను తమ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా సూర్యకుమార్ యాదవ్ను మెచ్చుకున్నాడు. అతని ఆటకు ముగ్ధుడిని అయ్యానని వెల్లడించాడు. 


క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లుగా పేరొందడం మామూలు విషయం కాదని కపిల్ దేవ్ అన్నాడు. వివ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్మన్ గొప్ప ఆటగాళ్లుగా ఎదగడానికి వారి రికార్డులు మాత్రమే కారణం కాదన్నారు. వారి ఆటతీరు కూడా అందుకు కారణమని చెప్పుకొచ్చాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా వీరి సరసన చేరుతాడని ప్రశంసించాడు. సూర్య బ్యాటింగ్లో ఉండే తెగువ, టెక్నిక్ను సచిన్,వీవీయన్ రిచర్డ్స్, కోహ్లీ, రికీ పాంటింగ్లతో పోల్చాడు. సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడు శతబ్దానికి ఒక్కసారే వస్తారని కొనియాడాడు. 

సూర్యకుమార్ యాదవ్ కొట్టే కొన్ని షాట్లను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావడం లేదు. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని చూసినప్పుడు వీరని ఎవరితో అయినా పోల్చవచ్చు. నిజానికి భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు.  కానీ నేను మాత్రం సూర్యకుమార్ లాంటి ఆటగాడిని చూడలేదు. అతను ఆడే క్రికెటే వేరు. అతపే ల్యాప్‌లో కొట్టే ఫైన్ లెగ్ షాట్ బౌలర్‌ను భయపెడుతుంది. ఎందుకంటే అతను నిలబడి మిడ్-ఆన్ , మిడ్-వికెట్ మీదుగా సిక్సర్ కొట్టగలడు. బౌలర్  లైన్ అండ్ లెంగ్త్‌ను నిలకడగా ఎంచుకోగలడు. అందుకే  బౌలర్లు అతనికి బౌలింగ్ చేసేందుకు భయపడుతుంటారు. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రికీ పాంటింగ్ వంటి గొప్ప బ్యాటర్లను నేను చూశాను, అయితే క్రికెట్ లో చాలా కొద్దిమంది మాత్రమే  క్లీన్‌గా బంతిని కొట్టగలరు. ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్ బెస్ట్..అతనికి హ్యాట్సాఫ్. ఇలాంటి ఆటగాళ్లు సెంచరీకి ఒక్కసారి మాత్రమే వస్తారు’’ అని అని కపిల్ దేవ్ అన్నాడు.