
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ రెండో సారి కూడా మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన కరీనా ఆదివారం ( ఫిబ్రవరి 21) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రిద్ధిమా కపూర్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. 2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌లు పెళ్లి చేసుకోగా, 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించిన విషయం తెలిసిందెే. చిన్నప్పటి నుండి తైమూర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వరలో ఈ చిన్నారి వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.