
కరీంనగర్ టౌన్, వెలుగు: సీబీఎస్ఈ 10,12 తరగతుల ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కరీంనగర్ లోని వావిలాల పల్లిలో ఉన్న అల్ఫోర్స్ ట్రైనిటాట్స్ ప్రాంగణంలో నిర్వహించిన అభినందన సభలో మాట్లాడారు. సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ సంస్థకు చెందిన మహ్మద్ షాజ్నెన్ తబస్సుమ్ జాతీయ స్థాయిలో 99.4శాతంతో 497 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో టాపర్ గా నిలిచారని తెలిపారు.
ఎం. సుచీత్ రెడ్డి 493, జె.సుప్రభ492, ఆర్.వేదిక, టి.హార్షిని 491, డి.హార్షిత్489,బి.ఆక్రుతి, సిహెచ్ అనీష్ కుమార్, రయానుద్దీన్, 488, ఎ.నక్షత్ర, పి.శ్రీవర్షిత, కె.నక్షత్ర రెడ్డి 486 మార్కులు సాధించారని వివరించారు. అలాగే..12వ తరగతి ఫలితాల్లో 500 మార్కులకు గాను వి.సంజీత రెడ్డి 482(96.4%), ఎన్. అనిరుద్ సాయి 482(96.4%) , వి.శశాంక్ రెడ్డి 478(95.6%)మార్కులతో జిల్లా స్థాయి టాపర్లుగా నిలిచారని చెప్పారు. ప్రారంభించినప్పటి నుంచే అల్ఫోర్స్ జాతీయస్థాయి మార్కులతో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్లు పాల్గొన్నారు.