పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్ల కమీషన్ పైసలు .. ఒక్కో వీవోకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు బకాయిలు

 పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్ల కమీషన్ పైసలు .. ఒక్కో వీవోకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు బకాయిలు
  •  ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గత మూడు సీజన్లుగా ఇదే తీరు 
  •  ఈ మూడు సీజన్లకు సుమారు రూ.8కోట్లకు పైగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియగానే చెల్లించాల్సి ఉండగా.. పట్టించుకోని ఆఫీసర్లు

గంగాధర మండలంలో 2023–24 వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 58,771 క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశారు. క్వింటాకు రూ.32 కమీషన్ చొప్పున రూ.18.80 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇందులో రూ.13.16 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.5.64 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇదే ఏడాది యాసంగిలో 85,024 క్వింటాళ్లకు సంబంధించి రూ.27.20 లక్షలు, 2024–-25 వానాకాలంలో కొన్న 21,897 క్వింటాళ్లకు సంబంధించి రూ.7 లక్షల బకాయి ఉంది. ఈ రెండు సీజన్లలో పైసా కూడా ఇవ్వలేదు. మూడు సీజన్లు కలిపి ఒక్క గంగాధర మండలంలోనే రూ.39.85 లక్షల కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెల్లించాల్సి ఉంది. 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్ల నిర్వాహకులకు, ఆయా సంస్థలకు రెండేళ్లయినా కమీషన్ డబ్బులు అందడం లేదు. ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోళ్లు చేపట్టే మహిళా సంఘాలకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లకు, డీసీఎంఎస్ లకు, హకా సంస్థకు సకాలంలో కమీషన్ డబ్బులు రావడం లేదు. ఒక్కో వీవోకు,  పీఏసీఎస్, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మేర బకాయిలు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.8.50 కోట్లకుపైగా బకాయి ఉండొచ్చని అంచనా. మరోవైపు ఏ సీజన్ డబ్బులు ఆ సీజన్ ముగియగానే చెల్లించాల్సి ఉండగా.. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో కష్టపడి ధాన్యం కొనుగోళ్లు చేసిన కేంద్రాల నిర్వాహకులు.. ముఖ్యంగా మహిళా సమాఖ్య సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

కొనుగోళ్లపై ఉన్న శ్రద్ధ.. చెల్లింపుల్లో ఏది ?

ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాగానే టార్గెట్ రీచ్ అయ్యేందుకు సివిల్ సప్లై శాఖ ఆఫీసర్లతోపాటు డీఆర్డీఏ, సహకార శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఒత్తిడి పెంచుతుంటారు. దీంతో నిర్వాహకులు ఇటు హమాలీలను, అటు రైతులను, ఇంకోవైపు మిల్లర్లను, మరోవైపు లారీ యజమానులను సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. కొనుగోళ్లు జరిగే నెల, నెలన్నరపాటు చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఇంత కష్టపడినా కమీషన్ డబ్బులు రావడానికి ప్రతిసారి ఏడాదిన్నర, రెండేళ్లు పట్టడంతో అసహనానికి లోనవుతున్నారు. సీజన్ పూర్తికాగానే లెక్కలు చూసి ఒకటి, రెండు నెలల్లో కమీషన్ డబ్బులు జమ చేస్తే సంతోషించేవాళ్లమని, ఇలా రెండేళ్ల వరకు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టడం సరికాదని మహిళా సంఘాల బాధ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 10 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు.. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రతి సీజన్ లో 10 లక్షల నుంచి 12 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ కు గ్రేడ్ ఏ రకానికి రూ.32, కామన్ రకానికి రూ.31.75 చొప్పున కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అందజేస్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఒక్కో సీజన్ లో కమీషన్ డబ్బులు రూ.3.2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్ల నుంచి రూ.3.60 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. 2023–24 వానాకాలం సీజన్ కు సంబంధించి 70 శాతం కమీషన్ డబ్బులు చెల్లించి.. మిగతా 30 శాతాన్ని పెండింగ్ లో పెట్టారు. 

అలాగే 2023–24 యాసంగి, 2024–25 వానాకాలానికి సంబంధించి పైసా కూడా విడుదల చేయలేదు. మొత్తం కలిపితే సుమారు రూ.8.50 కోట్ల వరకు బకాయి ఉంటుందని అంచనా. ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయోనని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు.