
కరీంనగర్, వెలుగు: శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా)కు కరీంనగర్ వన్ టౌన్ పీఎస్ సమీపంలో 7 గుంటల స్థలం కేటాయించినట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఈ స్థలం గతంలో వివాదంలో ఉండగా.. ప్రభుత్వ భూమేనని తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆ స్థలం పాత భవన నిర్మాణాలను కొన్నాళ్ల క్రితం కూల్చివేశారు.
సుడాకు సొంత భవనం లేదని, ప్రస్తుతం జడ్పీ పరిధిలోని బిల్డింగ్ లో అద్దెకు నిర్వహించాల్సి వస్తోందని, తమకు స్థలం కేటాయించాలని ఇటీవల సుడా చైర్మన్ కలెక్టర్ కు లేఖ రాశారు. స్పందించిన ఆమె ఇటీవల 285 సర్వే నంబర్ లో ప్రభుత్వపరమైన 7 గుంటల స్థలాన్ని సుడాకు కేటాయించారు.