సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు : కలెక్టర్ పమేలా సత్పతి

సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో వివిధ శాఖల అధికారులతో సీజనల్‌‌‌‌‌‌‌‌ వ్యాధుల నియంత్రణ చర్యలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో శానిటేషన్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం వనమహోత్సవ నిర్వహణపై రివ్యూ చేశారు. జూన్ మొదటి వారం నుంచి జిల్లాలో మొక్కల పెంపకానికి అనువైన స్థలాలను గుర్తించి, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. 

 రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు

 జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పకడ్బందీగా ప్రొటోకాల్ అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో బాలమణి, అధికారులు పాల్గొన్నారు.