కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం సిటీలోని రేకుర్తి, హౌజింగ్ బోర్డు సమ్మక్కసారలమ్మ జాతర గద్దెలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భక్తులను ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ లచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
