
కరీంనగర్‌రూరల్, వెలుగు: ఇరుకుల్ల గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద వర్షాలకు దెబ్బతిన్న రోడ్డును వెంటనే రిపేర్లు చేయిస్తామని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. శనివారం గ్రామంలో దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫోర్ లేన్ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ధ్వంసమైందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన రాజేందర్రావు ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి రిపేర్ చేయిస్తానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ టవర్ సర్కిల్‌లో తిలక్‌యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం పంపిణీ చేశారు. సవరన్ స్ట్రీట్, కిసాన్ నగర్, అంబేద్కర్ నగర్‌తోపాటు పలు వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.