
కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి లైసెన్స్ కూడిన వెపన్స్ ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కరీంనగర్ సీపీ సత్యనారాయణ చెప్పారు. అసాంఘిక శక్తులు, మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉందని దరఖాస్తు చేస్తుకున్న వారిలో ఇద్దరికే నిబంధనల ప్రకారం వెపన్స్ పొందేందుకు లైసెన్స్ జారీ చేశామన్నారు. తుపాకీ బయటకు కనిపించేలా ప్రదర్శించిన నేతలకు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చామన్నారు. లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు ఆయుధాలు బయటకు కనిపించేలా మరోసారి ప్రవర్తిస్తే.. వారి లైసెన్స్ లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.