కవులు, కళాకారులు, విద్యావేత్తల నిలయం కరీంనగర్ : గవర్నర్ జిష్ణుదేవ్‌ ‌‌‌వర్మ

కవులు, కళాకారులు, విద్యావేత్తల నిలయం కరీంనగర్ : గవర్నర్ జిష్ణుదేవ్‌ ‌‌‌వర్మ
  • అధికారులు, ప్రముఖులతో ముఖాముఖిలో గవర్నర్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా కవులు, కళాకారులు, విద్యావేత్తల నిలయమని, వారి సేవలను జిల్లా అధికారులు ఉపయోగించుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్‌ ‌‌‌వర్మ సూచించారు. యూనివర్సిటీలో జరిగిన రెండో కాన్వొకేషన్‌‌‌‌కు హాజరైన గవర్నర్‌‌‌‌‌‌‌‌.. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు, జిల్లా ప్రముఖులతో ముఖాముఖీలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ జిల్లా సమగ్ర స్వరూపంతో పాటు జిల్లా విశేషాలను పీపీటీ ద్వారా వివరించారు. జిల్లాలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శుక్రవారం సభ నిర్వహిస్తూ మహిళలు, పిల్లల పోషణ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

 దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు అధికారులకు ప్రభుత్వ సిబ్బందికి  సైన్ లాంగ్వేజీలో శిక్షణ ఇచ్చామన్నారు. దీంతో గవర్నర్ ముగ్ధులై  కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను అభినందించారు. బంకించంద్ర చటోపాధ్యాయ 150 ఏళ్ల క్రితం రాసిన వందేమాతరం గీతం ప్రజలకు ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.