మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్: కరీంనగర్ జిల్లాలో అన్నదాతల ఆందోళన.. హుజూరాబాద్ లో నీట మునిగిన కాలనీలు.. ఇండ్లలోకి వరదనీరు

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్: కరీంనగర్ జిల్లాలో అన్నదాతల ఆందోళన.. హుజూరాబాద్ లో నీట మునిగిన కాలనీలు.. ఇండ్లలోకి వరదనీరు

మొంథా తుపాను ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో  భారీ వర్షం కురిసింది. దీంతో  కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు నేలవాలాయి. కోత కోసి రాశులుగా పోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది.  తడిసిన ధాన్యం మొలకెత్తుతుందని  రైతులు ఆందోళన చెందుతున్నారు.  వారం రోజుల్లో పంట చేతికొస్తుందనగా అకాల వర్షాలతో నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు..  

హుజూరాబాద్,  సైదాపూర్ మండలాల్లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది.  హుజూరాబాద్​ లో నీట మునిగిన కాలనీలు.. ఇండ్లలోకి వరదనీరు ప్రవేశించింది.   వరి పొలాలు వరద నీటికి మునిగిపోవడంతో అన్నదాతలు  ఆందోళన చెందుతున్నారు. హుజూరాబాద్ పట్టణంలో రోడ్డు పై నుండి ప్రవహిస్తున్న చిలుక వాగు, హుజూరాబాద్ - కనుకులగిద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

సైదాపూర్ శివారులో రోడ్డు పై నుండి భారీగా  ప్రవహిస్తుండతంతో  హుజూరాబాద్..  - హుస్నాబాద్  మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హుజూరాబాద్ మండలం  సింగపూర్ చెరువు పై బ్రిడ్జి నిర్మాణం సరిగా చేయక కట్ట తెగి పొలాల్లో నీళ్లు వచ్చాయని రైతులు ఆందోళన బాట పట్టారు . ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా  ఐ కే పి కార్యాలయాల్లో  వరి ధాన్యం తడిచింది.