- ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో రూ.1650 కోట్లతో కరీంనగర్ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేశామని, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. గురువారం సిటీలోని 21వ డివిజన్ విద్యానగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల హరిశంకర్ ఎన్నికల కార్యాలయాన్ని గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిశంకర్‌ను మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా 57వ డివిజన్ మాజీ కార్పొరేటర్(కాంగ్రెస్) జక్కని ఉమాపతి, తన సతీమణి అరుణతో కలిసి గంగుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. వీరితో పాటు 11వ డివిజన్‌కు చెందిన కట్ట లత, వేణు, 37వ డివిజన్ ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ షర్ఫుద్దీన్ తన అనుచరులు గంగుల సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
