
- మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌ను గ్రీన్‌సిటీగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణ, విద్యానగర్ ఏరియాల్లో శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవంలో భాగంగా సిటీ వ్యాప్తంగా పెద్దసంఖ్యలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
సిటీ ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలు, ఖాళీ ప్రదేశాల్లో పూలు, పండ్లు, ఔషధ మొక్కలను నాటాలన్నారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ వద్ద నిర్మించిన పబ్లిక్ టాయిలెట్, షెట్టర్లను పరిశీలించారు. ఆయన వెంట డీసీ ఖాజా మొహియుద్దీన్, ఎస్ఐ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.