కరీంనగర్ దోపిడి కేసు అప్ డేట్ : పీఎంజే జువెల్లరీ నిందితుడి కస్టడీ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూన్ 2కు వాయిదా

కరీంనగర్ దోపిడి కేసు అప్ డేట్ : పీఎంజే జువెల్లరీ నిందితుడి కస్టడీ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూన్ 2కు  వాయిదా

కరీంనగర్, వెలుగు: కరీంగనర్​లోని పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుభోద్ సింగ్ పోలీస్ కస్టడీ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. వివిధ దోపిడీ కేసుల్లో శిక్ష అనుభవిస్తూ బిహార్ పూర్నియా జైలులో ఉన్న సుభోద్ ను కరీంనగర్ పోలీసులు పిటీ వారెంట్ పై స్థానిక జైలుకు తరలించిన విషయం తెలిసిందే. 

పీఎంజే జ్యువెలరీ దోపిడీకి సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.