జాబ్ ఫ్రాడ్  కేసులో నిందితుడు​ అరెస్ట్

జాబ్ ఫ్రాడ్  కేసులో నిందితుడు​ అరెస్ట్
  • మయన్మార్  నుంచి రాగానే అరెస్ట్  చేసిన కరీంనగర్  పోలీసులు

క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీంన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కొలువుల పేరుతో ఇండియన్స్​ను మయన్మార్  సైబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్  కేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లించిన కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిన్  హితేశ్(29)ను కరీంనగర్  పోలీసులు గురువారం అరెస్ట్​ చేశారు. రూరల్  ఏఎస్పీ శుభం ప్రకాశ్​ కథనం ప్రకారం.. మానకొండూరు మండలం రంగంపేటకు చెందిన కొక్కిరాల లక్ష్మారెడ్డి కుమారుడు మధుకర్ రెడ్డి చైనీస్  జాబ్  అనే టెలిగ్రామ్  ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి ఉద్యోగం కోసం సంప్రదించాడు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా తన వివరాలను పంపగా, ఆ కంపెనీ అతడిని ఎంపిక చేసింది.

హైదరాబాద్  నుంచి బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన తరువాత గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన హితేశ్​ వాట్సాప్  ద్వారా మధుకర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు. అక్కడి నుంచి థాయిలాండ్ సరిహద్దులో ఉన్న హాంగ్ షింగ్  కంపెనీకి తీసుకెళ్లి అగ్రిమెంట్  రాసుకొని సంతకం చేయించుకున్నారు. ఆ తరువాత సైబర్ నేరాలు చేయమని ఒత్తిడి చేయడమే కాకుండా, చేయకపోతే టార్చర్  చేశారు. ఈ విషయాన్ని ఫోన్ లో తన తండ్రికి చెప్పడంతో ఆయన మానకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసి సమస్య వివరించాడు.

ఆయన చొరవతో మయన్మార్  సైన్యం సైబర్ కేఫ్​లపై దాడి చేసి 500 మందికి పైగా బాధితుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ ఏడాది మార్చిలో ఇండియాకు పంపించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన హితేశ్ ను మయన్మార్  ప్రభుత్వం స్వదేశానికి పంపింది. ఢిల్లీ ఎయిర్​పోర్ట్​లో ఇమిగ్రేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి సాయంతో కరీంనగర్  పోలీసులు గురువారం అరెస్ట్​ చేశారు.