కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌ను అప్గ్రేడ్ చేస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌ను అప్గ్రేడ్ చేస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి
  • క్రీడలు, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
  • స్పోర్ట్స్​ స్కూల్‌‌‌‌లో విద్యార్థులతో కలిసి మంత్రుల భోజనం

కరీంనగర్, వెలుగు:  ప్రపంచమే గర్వపడేలా క్రీడల్లో రాణించాలని, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌కు రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకురావాలని క్రీడలు, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విద్యార్థులకు సూచించారు. సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. 

మొదట కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని పాత ఆర్ట్స్ కాలేజీ వద్ద రూ.36 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఓల్డ్)  అదనపు తరగతి గదుల కొత్త భవనాన్ని మంత్రులు  ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియాన్ని సందర్శించి ఇండోర్ స్టేడియం, గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ లను పరిశీలించారు. అనంతరం ఉజ్వల పార్క్ సమీపంలో  చేప పిల్లల పెంపకాన్ని మంత్రులు  పరిశీలించారు. 

అనంతరం లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో సప్తగిరి కాలనీ వాకింగ్ ట్రాక్ వద్ద వనమహోత్సవంలో మొక్కలు నాటారు. తర్వాత కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ లో రూ.26 లక్షలతో కొత్తగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్‌‌‌‌ను ప్రారంభించారు. స్పోర్ట్స్​ స్కూల్‌‌‌‌లో విద్యార్థులతో కలిసి మంత్రుల భోజనం చేశారు. అనంతరం సింథటిక్ ట్రాక్ వద్ద రూ.10 లక్షలతో లైటింగ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీహరి మాట్లాడుతూ స్పోర్ట్స్​స్కూల్​ఇంటర్​ వరకు అప్​గ్రేడ్​ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ స్కూల్​ తెలంగాణలోనే రోల్​మోడల్‌‌‌‌గా నిలవాలని ఆకాంక్షించారు.  మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ క్రీడలకు ప్రజాపాలన ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌లో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు, సైక్లింగ్ వెలోడ్రోమ్, హ్యాండ్‌‌‌‌బాల్ కోర్టులు, వాలీబాల్ కోర్ట్‌‌‌‌లు, కబడ్డీ, ఖో-ఖో కోర్టులు ఏర్పాటు చేయాలని, పెవిలియన్ భవనం పునరుద్ధరించాలని  మంత్రి శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. 

 ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, విజయరమణారావు, సంజయ్​కుమార్​, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి, శాట్​ఎండీ బాలసోనీ దేవి, కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్​ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్​ సత్తు మల్లేశ్, ఆర్టీఏ మెంబర్​ రాహుల్​గౌడ్​, సీపీ గౌస్​ ఆలం, శాతవాహన వీసీ ఉమేశ్​కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వివిధ శాఖల అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.