
కరీంనగర్ టౌన్,వెలుగు: సిటీలోని ట్రినిటీ ఇంజినీరింగ్ కాలేజిలో శనివారం ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఉద్యోగాలు సాధించిన 212 మంది విద్యార్థులకు చైర్మన్ ప్రశాంత్ రెడ్డితో కలిసి ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డ్రైవ్‌లో 10 ఎంఎన్‌సీ కంపెనీలు పాల్గొన్నాయన్నారు. ప్రతి స్టూడెంట్ క్యాంపస్ప్లేస్మెంట్లో ఉద్యోగం సాధించేలా ప్రణాళికలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేంద్ర సింగ్, ఏవో రాజశేఖర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.