మీ కోసం మీ కర్మఫలం ఎదురు చూస్తుంది.. మోడీకి రాహుల్ కౌంటర్

మీ కోసం మీ కర్మఫలం ఎదురు చూస్తుంది.. మోడీకి రాహుల్ కౌంటర్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కరప్ట్ నంబర్ 1గాతన జీవితాన్ని ముగించారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై ఏఐసీసీ చీఫ్ రాహుల్గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ‘‘మోడీజీ యుద్ధం ముగిసింది. మీ కర్మఫలం మీకోసం ఎదురుచూస్తోంది. నా తండ్రిపై చేసిన విమర్శలు కూడా మిమ్మల్ని కాపాడలేవు”అని రాబోయే ఎన్నికల ఫలితాలనుద్దేశించి రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు.మీరెన్ని విమర్శలు చేసినా నా నుంచి మీకు ప్రేమతో ఓహగ్ అంటూ కామెంట్ చేశారు.

మరోవైపు ప్రియాంకగాంధీ ఘాటుగా స్పందించారు. మోడీ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తన తండ్రి దేశం కోసం చేసిన త్యాగాన్నిఅవమానపరిచారని విమర్శించారు. నిజాయితీగల,స్వచ్ఛమైన వ్యక్తిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మోడీది ‘నియంత్రణలేని పిచ్చి తనం’ అంటూ ధ్యజమెత్తారు. అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లడిగే మోడీ..ఒక గొప్ప వ్యక్తి బలిదానాన్ని తక్కువచేసి మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి అద్దం పడుతోందన్నా రు.మోడీకి తగ్గట్టుగా సమాధానం ఇచ్చేందుకు అమేథీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

సూడో నేషనలిస్టులకు రాజీవ్ అర్థం కారు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, సామ్ పిట్రోడా, రన్దీప్ సింగ్ సుర్ జేవాలా మోడీ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. సూడో నేషనలిజంతో ప్రజలను విభజిస్తూ రాజకీయాలు చేసే బీజేపీ లీడర్లకు.. రాజీవ్ గాంధీ లాంటి గొప్ప నేత బలిదానం అర్థం కాదని అహ్మద్ పటేల్ ట్విట్టర్ లో పేర్కొన్నా రు. మోడీ ఓనకిలీ జాతీయవాది అని విమర్శించారు. అమరులపై నిందలు వేస్తూ అవమానించిన ఇలాంటివారిని దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. దేశానికి వ్యతిరేకంగా నకిలీ జాతీయవాది చేసిన పాపాల లిస్టు..దేశ చరిత్ర పుటల్లో నల్లసిరాతో లిఖించబడుతోందని అన్నా రు.మోడీవి లేనిపోని ఆరోపణలు మాజీ ప్రధానిపై మోడీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవేనంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంమోడీ వ్యాఖ్యలను ఖండిం చారు. ఆ విషయం ఢిల్లీ హైకోర్టే నిర్ధారించిందని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయరాదని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం మోడీకి తెలియదా?అంటూ ప్రశ్నిం చారు. చనిపోయిన వ్యక్తిపై లేని పోని ఆరోపణలు చేసి.. మోడీ హద్దులు దాటేశారనిచిదంబరం మండిపడ్డారు.