105ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. కర్నాటక కొప్పాల్ జిల్లాలో ఇప్పటి వరకు 8వేల కేసులు నమోదవ్వగా..రోజుకి వందలమందికి కరోనా సోకుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
కరోనా సోకిన వారిలో యువకులు, మహిళల్లో వైరస్ తగ్గుముఖం పట్టింది. తాజాగా 105ఏళ్ల బామ్మ కరోనా జయించిందని డాక్టర్లు చెప్పారు.
కొద్దిరోజుల క్రితం కొప్పాల జిల్లాకు చెందిన 105ఏళ్ల బామ్మ కమలమ్మకు కరోనా లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమె మనవడు డాక్టర్ శ్రీనివాస్ టెస్ట్ లు చేశారు. ఆ టెస్ట్ ల్లో కమలమ్మకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ చేయించాలని కమలమ్మ కొడుకు శంకర గౌడ, కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అయితే బామ్మ మాత్రం తాను ఆస్పత్రికి వెళ్లనని, ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటానని పట్టుబట్టింది. దీంతో చేసేది లేక మనవడు శ్రీనివాస్ తన నాయినమ్మను ఇంట్లోనో ఉంచి ట్రీట్మెంట్ అందించారు.
రాగులతో చేసిన ఆహారంతో పాటు కొన్ని ట్యాబ్లెట్లను మింగించారు. దీంతో కొద్దిరోజులకే కరోనా తగ్గింది. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఇమ్యూనిటీ పవర్ వల్ల కరోనా నయమైందని తెలిపారు.
ప్రతీ ఒక్కరు కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవాలన్నారు. కరోనా సోకినా ఆందోళన చెందకుండా కరోనా ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు.
