కర్ణాటకలో కొనసాగుతున్న పోలింగ్

కర్ణాటకలో కొనసాగుతున్న పోలింగ్

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామునే ఓటర్లు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు స్థానాల్లో న్యాయ సంబంధ కేసులు విచారణలో ఉండడంతో వాటిని పెండింగ్ లో ఉంచారు. రాజీనామా చేసిన అభ్యర్థులంతా అనర్హులని ప్రకటించిన సుప్రీంకోర్టు…. ఉపఎన్నికలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.

అనర్హత వేటు పడిన వారిలో 16 మంది బీజేపీలో చేరగా…వారిలో 13 మంది పోటీ చేస్తున్నారు. వీరందరికీ మంత్రి పదవులిస్తానని ఇప్పటికే సీఎం యాడ్యూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ 15 స్థానాల్లో పోటీ చేస్తుండగా… జేడీఎస్ 12, బీఎస్పీ 2, ఎన్సీపీ ఒక్కో స్థానంలో పోటీకి దిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ప్రస్తుతం వేరువేరుగా పోటీ చేస్తున్నాయి.