కర్ణాటక​లో కాంగ్రెస్ లీడ్.. హంగ్ దిశగా ఎగ్జిట్ పోల్స్.. జేడీఎస్ కింగ్ మేకర్

కర్ణాటక​లో కాంగ్రెస్ లీడ్.. హంగ్ దిశగా ఎగ్జిట్ పోల్స్.. జేడీఎస్ కింగ్ మేకర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వగా.. మరికొన్ని హంగ్ దిశగా ఇచ్చాయి. అన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ లీడ్ లో ఉందని స్పష్టం చేశాయి. కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224 ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు.. సర్వేలు అన్నీ కాంగ్రెస్ కు వంద సీట్లు వస్తాయని గట్టిగా చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన పూర్తి మెజార్టీ రావటం కష్టంగా చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటులో జేడీఎస్ కీలకంగా వ్యవహరించనున్నట్లు సర్వే రిజల్ట్స్ చెబుతున్నాయి. 

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. అధికారానికి కావాల్సిన బలం 113 సీట్లను ఏ ఒక్క పార్టీ సొంతంగా దక్కించుకోలేదని ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని.. కనీసం 20 సీట్ల జేడీఎస్ గెలుస్తుందని.. ప్రభుత్వం ఏర్పాటులో జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ :

ఆత్మ సాక్షి సర్వే :

బీజేపీ : 83 – 94
కాంగ్రెస్ : 117 – 124
జేడీఎస్ : 23 – 30
ఇతరులు : 02 – 08

పీపుల్స్ పల్స్ సర్వే :

బీజేపీ : 78 – 90
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 23 – 29
ఇతరులు : 01 – 03

రిపబ్లిక్ టీవీ సర్వే  :

బీజేపీ : 85 – 100
కాంగ్రెస్ : 94 – 108
జేడీఎస్ : 24 – 31
ఇతరులు : 02 – 06

జన్ కీ బాత్ సర్వే :

బీజేపీ : 94 – 117
కాంగ్రెస్ : 91 – 103
జేడీఎస్ : 14 – 24
ఇతరులు : 0 – 4

పొలిటికల్ ల్యాబరేటరీ సర్వే :

బీజేపీ : 80 
కాంగ్రెస్ : 108
జేడీఎస్ : 32 
ఇతరులు : 04

ఇండియా టుడే సర్వే :

బీజేపీ : 74 – 86
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 17 – 20
ఇతరులు : 0 – 3

ఏబీపీ – సీ ఓటర్ సర్వే :

బీజేపీ : 74 – 86
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 23 – 35

జీ న్యూస్ సర్వే :

బీజేపీ : 103 – 115
కాంగ్రెస్ : 79 – 91
జేడీఎస్ : 26 – 36

జీ మ్యాట్రిస్ సర్వే:

బీజేపీ- 79 -94
కాంగ్రెస్- 103 - 118
జేడీఎస్- 25- 33

టైమ్స్ నౌ సర్వే :

బీజేపీ 114
కాంగ్రెస్ 86
జేడీయూ 21
ఇతరులు 3