ఖేడ్ లో కర్ణాటక రైతులు ధర్నా

ఖేడ్ లో కర్ణాటక రైతులు ధర్నా

నారాయణ్ ఖేడ్, వెలుగు: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఫెయిల్ అని కర్ణాటక రైతులు అన్నారు. శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి మీడియా సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని, తెలంగాణలోనూ అమలు కావన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​    ప్రభుత్వంతోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక రైతులు చేస్తున్న ర్యాలీని నారాయణఖేడ్ కాంగ్రెస్ లీడర్లు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్ ఎస్టీ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ భీమ్రావు నాయక్  మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ నాయకులు చేపిస్తున్న ర్యాలీలు, దొంగ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఈ నెల 30న జరిగే సీఎం కేసీఆర్​ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.