సెంట్రల్ సహయోగ్ పోర్టల్‌లో చేరాల్సిందే..ఎలాన్ మస్క్ (X కార్ప్)పిటిషన్ ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

సెంట్రల్ సహయోగ్ పోర్టల్‌లో చేరాల్సిందే..ఎలాన్ మస్క్ (X కార్ప్)పిటిషన్ ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

కర్ణాటక హైకోర్టులో  ఎలాన్ మస్క్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇండియాలో సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ కార్ప్ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు బుధవారం (సెప్టెంబర్24) తిరస్కరించింది. 

భారత్ లో సోషల్ మీడియా కంటెంట్ ను నియంత్రించే సెంట్రల్ సహాయోగ్ పోర్టల్ లో చేరాలని X సోషల్ మీడియా ప్లాట్ ఫాం కు కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.అయితే కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ X కార్ప్ ఈ ఏడాది మార్చిలో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది.. బుధవారం విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్ ను తిరస్కరించింది. 

సోషల్ మీడియాలో కంటెంట్ ను నియంత్రించాల్సిన అవసరం ఉంది.. అందుకు అనుగుణంగా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ ఫాం సెంట్రల్ సహాయోగ్ పోర్టల్ లో చేరాల్సిందేనని జస్టిస్ ఎం. నాగప్రసన్న తెలిపారు. X కార్ప్ లేవనెత్తిన అంశాలు కోర్టు పరిధిలో లేవన్నారు .

►ALSO READ | IRCTC స్కాం: లాలూ ప్రసాద్ యాదవ్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు

భారత్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ), స్వేచ్ఛా వాక్ ,భావ ప్రకటనా హక్కు ఆర్టికల్ 19 (2) కింద కొన్ని పరిమితుల ద్వారా రక్షణ కల్పించారు. అమెరికన్ న్యాయవ్యవస్థను భారత రాజ్యాంగంపై రుద్దే ప్రయత్నం చేయొద్దని కోర్టు హెచ్చరించిన కోర్టు.. X కార్ప్ పిటిషన్ ను కొట్టివేసింది.