బిగ్ అలర్ట్ : విజృంభిస్తోన్న జికా వైరస్

బిగ్ అలర్ట్ : విజృంభిస్తోన్న  జికా వైరస్

బెంగళూరు అర్బన్ జిల్లాకు సమీపంలో ఉన్న చిక్కబళ్లాపూర్ జిల్లాలో దోమల్లో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య అధికారులు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రారంభ దశలో సంక్షోభాన్ని తగ్గించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని 68 వేర్వేరు ప్రాంతాల్లో దోమల శరీరంలో జికా వైరస్‌ ఉందో, లేదో పరీక్షించామని ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించారు. సిడ్లఘట్ట తాలూకాలోని తలకాయలబెట్ట గ్రామంలో దోమల్లో జికా వైరస్ కనిపించింది. దీంతో వెంటనే ఆరోగ్య అధికారులు చర్యలు చేపట్టారు, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలను ప్రారంభించారు.

Also Read :- జుట్టుకు ఆముదం మంచిదేనా

30 మంది గర్భిణులు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురి రక్త నమూనాలను సేకరించిన అధికారులు బెంగళూరుకు పరీక్షల నిమిత్తం పంపారు. తలకాయల బెట్ట గ్రామానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి నమూనాలు సేకరించారు. వెంకటాపుర, దిబ్బురహళ్లి, బచ్చనహళ్లి, వడ్డహళ్లి తదితర ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. చిక్కబళ్లాపుర జిల్లాలో జికా వైరస్‌ ఉన్నట్లు చిక్కబళ్లాపుర జిల్లా ఆరోగ్య అధికారి మహేష్‌కుమార్‌ ధృవీకరించారు. ఈ ప్రాంతంలో సుమారు 5 వేల మందిని ఆరోగ్య అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.