కర్నాటకలోని ఉడిపి జిల్లాలో నల్లా నీళ్లు తాగి 500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఉప్పుండాలో స్థానిక ఓవర్‌హెడ్ ట్యాంక్ నుంచి సరఫరా చేసిన కలుషిత నీటిని తాగడం వల్ల ఈ ఘటన జరిగిందని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఐపి గడద్ అక్టోబర్ 5న తెలిపారు.
రెండు వార్డులకు సరఫరా చేస్తున్న నీటిలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధికారక సాల్మొనెల్లా బాసిలరీ జాతులు జాఉన్నట్లు గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదన్నారు. ప్రస్తుతానికి అందరిక ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
Karnataka | More than 500 people fell ill after drinking contaminated water supplied from a local overhead tank in Uppunda in Udupi district. The condition of none of the sick is serious... Water-borne pathogenic salmonella bacillary strains were found in the water supplied to…
— ANI (@ANI) October 5, 2024