కర్ణాటకలో హుక్కా నిషేదిస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు

కర్ణాటకలో హుక్కా నిషేదిస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు

యువత ఆరోగ్యాన్ని కాపాడటానికి కర్ణాటక రాష్ట్రంలో హుక్కా తాగడం, అమ్మడాన్ని నిషేదిస్తూ ఆ రాష్ట్రం ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే 2016 -17 కర్ణాటక రాష్ట్రంలో 22.8 శాతం మంది పొగతాగుతున్నారని, 23.9శాతం బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని తేల్చి చెప్పింది.

దీంతో ఆ రాష్ట్రంలో హుక్కా తాగడాన్ని, అమ్మడాన్ని నిషేదిస్తూ మంగళవారం అధికారిక ప్రకటన జారీ చేసింది. దీనికి అనుగుణంగా  సిగరెట్స్ అండ్ అథర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ (COTPA) చట్టాన్ని సవరించింది.