బెంగళూరు: లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న కర్ణాటక ప్రజలకు అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడించింది. నిర్మాణ కార్యకలాపాలు, ప్యాకింగ్ మెటీరియల్ తయారీ, కొరియర్ సర్వీసులను అనుమతిస్తారు. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్స్, కార్పెంటర్లు ఇతర సెల్ఫ్ఎంప్లాయిస్కు కూడా తమ పనులు చేసుకునేందుకు వీలు కల్పించారు. 50 శాతం సిబ్బందితో టీ, కాఫీ, రబ్బర్ప్లాంటేషన్ సంస్థల్లో పనులు చేసుకోవచ్చు. కంటెయిన్‌మెంట్ జోన్లలో మాత్రం ఎలాంటి సడలింపులు ఉండవని, కంటెయిన్‌మెంట్ జోన్ల బయట వాటికి మాత్రమే ఈ సడలింపులు వర్తిస్తాయని చీఫ్ సెక్రెటరీ టీఎమ్ విజయ్‌భాస్కర్ చెప్పారు.
