విదర్భతో సెమీస్ పోరు: పడిక్కల్‌‌‌‌‌‌‌‌పైనే కర్నాటక ఆశలు

విదర్భతో సెమీస్ పోరు: పడిక్కల్‌‌‌‌‌‌‌‌పైనే కర్నాటక ఆశలు

బెంగళూరు: విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీ తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌లో కర్నాటక, విదర్భ రెడీ అయ్యాయి. గురువారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచి ఫైనల్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ను ఖాయం చేసుకోవాలని ఇరుజట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌పై కర్నాటక ఎక్కువగా అంచనాలు పెట్టుకుంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌, కరుణ్‌‌‌‌‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌, అభినవ్‌‌‌‌‌‌‌‌ మనోహర్‌‌‌‌‌‌‌‌తో కూడిన బలమైన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌ కర్నాటక సొంతం. 

విద్వత్‌‌‌‌‌‌‌‌ కావేరప్ప, అభిలాష్‌‌‌‌‌‌‌‌ షెట్టి, విద్యాధర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌, విజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ వైశాక్‌‌‌‌‌‌‌‌తో కూడిన పేస్‌‌‌‌‌‌‌‌ బలగం కూడా మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. మరోవైపు విదర్భను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఛేదనలోనూ విదర్భకు మంచి రికార్డు ఉంది. అమన్‌‌‌‌‌‌‌‌ మోఖడే, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్ష్‌‌‌‌‌‌‌‌ దూబే, అథర్వ తైడ్‌‌‌‌‌‌‌‌, ధ్రువ్‌‌‌‌‌‌‌‌ షోరే బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోర్లు ఖాయం.