లక్ అంటే ఇతడిదే..రూ.23 కోట్ల లాటరీ

లక్ అంటే ఇతడిదే..రూ.23 కోట్ల లాటరీ

ఆ అబ్బాయి ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్. ఎప్పుడూ దురదృష్టమే వెంటాడింది. తల్లిదండ్రులిద్దరూ కిడ్నీ జబ్బుతో చనిపోయారు. దుబాయ్​లో ఉద్యోగం చేయాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. పాస్​పోర్టు వచ్చినా వెళ్లలేకపోయాడు. సరే అని తనకు తెలిసిన వాళ్లు చేస్తున్న కంపెనీలోనే అకౌంటెంట్​గా జాబ్​లో చేరాడు. పనిలో పనిగా ఎప్పుడో అప్పుడు తగలకపోతుందా అని దుబాయ్​ లాటరీ టికెట్లు కొన్నాడు. ఆరు సార్లు ప్రయత్నించాడు. ఇప్పుడు అతడిని అదృష్టం వరించింది. ₹23 కోట్ల లాటరీ తగిలింది. అతడి పేరు మహ్మద్​ ఫయాజ్​. ఊరు కర్ణాటకలోని జట్టిపాల. ముంబైలో అకౌంటెంట్​గా పనిచేస్తున్నాడు. లాటరీలో వచ్చిన డబ్బుతో అన్నను చదివిస్తానంటున్నాడు. దుబాయ్​కు వెళ్లి జాబ్​ చేస్తానని చెబుతున్నాడు. తన తండ్రి సౌదీ అరేబియాలో ఎన్నోఏళ్లపాటు కష్టనష్టాలకోర్చి పనిచేశాడని చెప్పాడు. అతడికి అన్నతో పాటు ఇద్దరు చెల్లెళ్లున్నారు. తన అన్న చదువు ఆపేసి ట్రక్కు నడుపుతూ బతుకుతున్నాడని, ఇక, అన్నను పని మాన్పించి మంచి చదువులు చదివిస్తానని చెప్పాడు.