- వరల్డ్‌లోనే పొడవైన రైల్వే ఫ్లాట్‌ఫామ్ కన్‌స్ట్రక్షన్
- 1400 మీటర్ల పొడవుతో నిర్మాణం
హుబ్లీ: కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచ రికార్డ్ సిద్ధం అవుతుంది. ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తుంది. దాని పొడవు 1400 మీటర్లు కాగా.. వెడల్పు 10 మీటర్లు అని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 550 మీటర్ల ఫ్లాట్‌ఫామ్‌ను 1400కు పెంచుతున్నట్లు చెప్పారు. రూ.90 కోట్లతో చేపట్టిన రీమోడలింగ్ పనుల్లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నట్లు సౌత్ వెస్ట్ రైల్వే ప్రకటించింది. వచ్చే ఏడాది కల్లా పనులు పూర్తవుతాయని చెప్పింది. దీంతో పాటు మరో రెండు ఫ్లాట్‌ఫామ్‌లు కడుతున్నామని, దీంతో స్టేషన్‌లో మొత్తం 8 ఫ్లాట్‌ఫామ్‌లు అవుతాయని చెప్పారు. ఈ ఫ్లాట్‌ఫాం నిర్మాణం పూర్తైతే ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ స్టేషన్‌లో ఉన్న లాంగెస్ట్ రైల్వే ఫ్లాట్‌ఫామ్ రికార్డును దాటుతుందని అన్నారు. గోరఖ్‌పూర్‌లో ప్రస్తుతం 1366 మీటర్ల పొడవైన ఫ్లాట్‌ఫాం ఉంది. ఆ తర్వాత కేరళలోని కొల్లమ్ జంక్షన్‌లో 1180 కిలోమీటర్ల ఫ్లాట్‌ఫాం ఉంది.
