‘సర్దార్’ మూవీ ట్రైలర్ రిలీజ్

‘సర్దార్’ మూవీ ట్రైలర్ రిలీజ్

పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళ నటుడు కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్’ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కార్తి సరసన రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం రిచ్ గా.. ఆసక్తికరంగా ఉంది. చంకీపాండే కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే భారత ఆర్మీ నేపథ్యంలో రూపొందినట్లు అర్థమవుతుంది. 

ట్రైలర్ లో హీరో కార్తి విభిన్న లుక్స్ తో కనిపించడం ఉత్కంఠ రేపుతోంది. రిచ్ సీన్లకు తగ్గట్టుగా జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ కే హైలైటా గా నిలుస్తుంది. స్టార్టింగ్ లోనే.. సర్దార్ ను పట్టుకోవడం అంత ఈజీ కాదు.. అనే డైలాగ్ తో.. సెర్చింగ్ సీన్ ఉత్కంఠ రేపుతుంది. సర్దార్ అంటే ఎవరు.. హీరో కార్తి విభిన్న రూపాల్లో ఎందుకు కనిపించారు.. ? అలా కనిపించడానికి కారణాలేంటి.. డబుల్ రోల్ చేస్తున్నారా. . ?  అనే సందేహాలు వెంటాడుతాయి. ఈ సందేహాలకు తెరపడాలంటే ఈనెల 21 వరకు ఆగాల్సిందే.

ఎందుకంటే దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 21న థియేటర్లలో రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. తమిళ, తెలుగుతోపాటు వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించేందుకు మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇవాళ టీజర్ ను రిలీజ్ చేశారు.