కార్తీక మాసం.. కీసరగుట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు

 కార్తీక మాసం.. కీసరగుట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా కీసర గుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 2023, నవంబర్ 14వ తేదీ మంగళవారం కార్తీకమాసం మొదటి రోజు కావడడంతో ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం రమేష్ శర్మ తెలిపారు. ఆలయం పరిసరాల్లో భక్తులకు ఏమైనా ఇబ్బందులు కలిగినా పక్కనే ఉన్న ఈ ఓ కార్యాలయంలో తెలియజేయల్సిందిగా భక్తులకు సూచించారు. 

ఆలయ ప్రధాన అర్చకులు బలరాం శర్మ మాట్లాడుతూ.. కార్తీకం మాసం అంటే శివుడికి ఇష్టమైన మాసం అని అన్నారు.  లింగంపై నీళ్ళు పోసి అభిషేకం చేస్తే మంచిదని చెప్పారు. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.కార్తీక మాసంలో భక్తులు ఆలయ పరిసర ప్రాంతంలో దీపాలు వెలిగిస్తే అంత మంచి జరుగుతుందని అన్నారు.

ALSO READ : మన్మథ్ స్వామి క్షేత్రానికి భక్తుల పాదయాత్ర