కార్తీకమాసం 2025:చివరి సోమవారం (నవంబర్17) ఇలా చేయండి..వివాహం.. సంతాన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది

కార్తీకమాసం 2025:చివరి సోమవారం (నవంబర్17) ఇలా చేయండి..వివాహం.. సంతాన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది

 కార్తీకమాసం చివరిసోమవారం ( 2025,నవంబర్​ 17) న   కాలసర్పదోషంతో బాధపడేవారు కొన్ని పరిహారాలతో నాగదోషం నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  అసలు కాల సర్ప దోషం అంటే ఏమిటి, ఈ దోషం ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. కార్తీక చివరి సోమవారం నాడు సాయంత్రం ఎలాంటి పూజలు చేయాలి. ..

హిందువులు జాతకాలు ఎక్కువుగా విశ్వసిస్తుంటారు.  ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా.. పెళ్లి కాకపోయినా... వివాహం అయిన చాలా రోజులకు సంతానం కలుగపోయినా.. పండితులను... జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తుంటారు . పండితులు తెలిపిన వివరాల ప్రకారం జాతకంలో కాలసర్పదోషం ఉంటే  వివాహం.. సంతాన సమస్యలు వస్తాయని చెబుతుంటారు.  అలాంటి వారు కార్తీక మాసంలో చివరి సోమవారం ( నవంబర్​17)న కొన్ని పరిహారాలు పాటిస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. . .!

 

కాల సర్ప దోషంతో బాధపడుతున్నారో అలాంటి వారందరికీ ఈ పవిత్రమైన (20205నవంబర్​17)  రోజున సాయంత్రం చేసే కొన్ని పరిహారాల వల్ల నాగదోషం తొలగిపోతుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

​కాలసర్ప దోష లక్షణాలు..

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉంటుందో వారికి వివాహ సమస్యలు.. సంతాన సమస్యలు అధికంగా ఉంటాయి.  అలాంటి   వారిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. తరచుగా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. పేదరికం, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు,  వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా, శారీరక పరంగా ఎల్లప్పుడూ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

నాగ దోషం అనేది  జాతకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే రాజయోగం రెండు లేదా దానికన్నా ఎక్కువగా ఉంటే వారిపై కాల సర్ప దోషం ప్రభావం తగ్గిపోతుంది. నాగ దోషాన్ని తగ్గించేందుకు శివాలయంలో రాహు, కేతువులకు  ( నవంబర్​ 17) ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.  నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.  నవగ్రహ మంత్రాలను పఠించాలి.  సాయంత్రం ప్రదోషకాలంలోరావిచెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు. 

రాహువుకు  మినుములు సమర్పించి.. బ్రాహ్మణులకు నీలం రంగు వస్త్రాలు  దానం ఇవ్వాలి.   కొబ్బరికాయ, గోమేధికం, కంబళి, నూనె వంటివి కూడా దానం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.  కేతు గ్రహాన్ని శాంతింపజేసేందుకు  ఉలవలను దానంచేయాలి. వినాయకుడిని గరికతో పూజించాలి. 

​ఈ మంత్రాలను జపించాలి..

నాగ దోషం నుంచి విముక్తి కావాలనుకునేవారు మహా మృత్యుంజయ మంత్రం, శ్రీ విష్ణు పంచాక్షరి మంత్రాలను పఠించాలి. కాల సర్ప దోషం నుంచి విముక్తి పొందడానికి మీ ఇంట్లో నెమలి ఈకలను ధరించిన క్రిష్ణుడి విగ్రహాన్ని లేదా ఫొటోను ఉంచి, తనను పూజిస్తూ ‘ఓం నమో భగవతే వాసు దేవాయ’ అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు జపిస్తే కచ్చితంగా మంచి ఫలితాలొస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

​ఈశ్వరునికి రుద్రాభిషేకం..

నాగ దోషం నుంచి తప్పించుకోవడానికి కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం రోజున ( నవంబర్​ 17)  పరమేశ్వరునికి కచ్చితంగా రుద్రాభిషేకం చేయాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. అదే విధంగా నాగదేవతలను పూజించడం వల్ల ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన వెండి ఉంగరాలను ధరించాలి. ముఖ్యంగా గోమేధికం ధరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, ఉంగరాన్ని  ఎడమచేతి మధ్య వేలుకు ధరించాలని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం ఆధ్యాత్మిక పండితుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.