బుల్లెట్ పై బ్యాలెట్ విజయం : ఓ కశ్మీరీ సంబురం

బుల్లెట్ పై బ్యాలెట్ విజయం : ఓ కశ్మీరీ సంబురం

ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పదనమే అది. ప్రశాంతంగా బతకాలి… ఇబ్బంది లేకుండా బతకాలి.. ఆనందంగా బతకాలి అని ఎవరికుండదు. నిత్యం ఉగ్రవాదులు, వేర్పాటువాదుల చర్యలతో భగభగలాడే సరిహద్దు కశ్మీరీ పల్లెలు, పట్టణాల్లో.. స్థానికులు అలా కోరుకోవడంలో తప్పేలేదు.

ఇవాళ ఏప్రిల్ 11న కశ్మీర్ లోనూ లోక్ సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇక్కడి ఆరు లోక్ సభ స్థానాలు జమ్ము, బారాముల్లాల్లో ఇవాళ ఎన్నికలు పూర్తయ్యాయి. శ్రీనగర్, ఉదంపూర్, అనంతనాగ్, లడఖ్ లలో రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కశ్మీర్ లో మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు పూర్తికానున్నాయి.

వేర్పాటువాదులకు అడ్డా అయిన జమ్ము, బారాముల్లాల్లో స్థానికులు పెద్దసంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ ను బహిష్కరించాలంటూ ఉగ్రవాద సానుభూతి పరులు హెచ్చరికలు చేసినా వారు పట్టించుకోలేదు. ఉదయం నుంచే పెద్దఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల కోసం పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. హెచ్చరికలు కాదని జరుగుతున్న పోలింగ్ ను ప్రజాస్వామికవాదులు స్వాగతించారు. ఈ సందర్భంగా.. బండిపొరాలోని నైడ్ ఖై అనే ఏరియాలో… ఓటేసేందుకు వచ్చిన ఓ స్థానికుడు డాన్స్ చేశాడు.క్యూలైన్లో నిల్చున్నవారంతా ఇది చూసి ఎంజాయ్ చేశారు. బుల్లెట్ పై బ్యాలెట్ విజయానికి చిహ్నంగా ..  సంబురాలు చేసుకుంటున్నారు ఓ కశ్మీరి.