మద్యం పాలసీ వైసీపీ కొంప ముంచింది.. కాసు మహేష్ రెడ్డి..

మద్యం పాలసీ వైసీపీ కొంప ముంచింది.. కాసు మహేష్ రెడ్డి..

2024 ఎన్నికల్లో కేవలం 11సీట్లకే పరిమితమై ఘోర పరాభవాన్ని చవి చూసింది వైసీపీ.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రుల్లో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా వైసీపీ పట్టు సాధించలేకపోయింది. ఇంతటి ఘోర ఓటమిని ఎవ్వరు కూడా ఊహించలేదు.ఇప్పటికే ఓటమికి గల కారణాలపై పార్టీ అధినేత జగన్ వైసీపీ నేతలతో సమీక్షలు కూడా నిర్వహించారు. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు వైసీపీ ఓటమికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు.

తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైసీపీ ఓటమికి కారణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ వైసీపీ ఓటమికి గల ప్రధాన కారణమని, మద్యం పాలసీపై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని జనం నమ్మారని అన్నారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారంటూ టీడీపీ చేసిన ప్రచారం వైసీపీని దెబ్బ తీసిందని అన్నారు. మందుబాబులు ఎవరూ వైసీపీకి ఓటెయ్యలేదని అన్నారు.

మద్యం పాలసీ మార్చాలని సజ్జల, విజయసాయిరెడ్డి లకు చాలాసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని అన్నారు.దీంతో పాటు టీడీపీ నుండి వైసీపీలో చేరిన కొంతమంది నేతల నోటి దురుసు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చాగేసిన దుష్ప్రచారం కూడా వైసీపీ ఓటమికి కారణమయ్యాయని అన్నారు.