పటాన్ చెరు టికెట్పై కాంగ్రెస్లో రగడ.. కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరుల ఆందోళన

పటాన్ చెరు టికెట్పై కాంగ్రెస్లో రగడ.. కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరుల ఆందోళన

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు దక్కని నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకే టికెట్ వస్తుందని ఆశపడ్డ నాయకులకు చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా పటాన్ చెరులో కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు నిరసనలు వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి పోస్టర్లు, బ్యానర్లు కాల్చి నినాదాలు చేశారు. 

తనకు టికెట్ రాకపోవడంతో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సంవత్సరాలుగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన తనకు టికెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 80 వేల ఓట్లు తెచ్చుకున్నారు కాట శ్రీనివాస్ గౌడ్. కష్టపడ్డ వారికి టికెట్ కేటాయించకుండా కేవలం రాజకీయ ప్రలోభాలకు లొంగి.. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడం ఏంటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పటాన్ చెరు టికెట్ ను నీలం మధుకు ఇచ్చారు. దీంతో కాటా శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తితో ఉన్నారు.