కత్తి మహేష్ పరిస్థితి విషమం

కత్తి మహేష్ పరిస్థితి విషమం

నెల్లూరు: సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన విషయం  తెలిసిందే. కత్తి మహేశ్ కారు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆయనను నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక కన్ను దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందిపడుతున్నట్లు వైద్య వర్గాలు ప్రకటించాయి. 
ఈ పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై తరలించాలని కుటుంబ సభ్యులు కోరగా.. ప్రత్యేక అంబులెన్స్ లో చెన్నై తీసుకెళ్లారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని చెబుతున్నారు. సీటీ స్కాన్ రిపోర్టులో తల, కంటి భాగంలో తీవ్ర గాయాలైనట్లు తేలింది. తలపై గాయం కావడంతోపాటు.. రక్తస్రావం కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.