కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో50 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో50 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేట, వెలుగు: కాజీపేటలో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో 50 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం కాజీపేటకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవను స్థానిక రైల్వేస్టేషన్ లోని వీఐపీ లాంజ్ లో కలిసి మాట్లాడారు. కాజీపేట బస్టాండ్ కు రైల్వే స్థలం అప్పగించాలన్నారు.  రైల్వేస్టేషన్ లో హాల్టింగ్ నిలిపివేసిన రైళ్లకు తిరిగి హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయశ్రీ రజాలి, జక్కుల రవీందర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్​అంకూస్, సీనియర్ నాయకులు పసునూరి మనోహర్ పాల్గొన్నారు.

4  రైళ్లకు హాల్టింగ్​ ఇవ్వాలి 

జనగామ అర్బన్, వెలుగు: సౌత్​సెంట్రల్​రైల్వే జీఎం సంజయ్​ కుమార్ శ్రీవాత్సవ గురువారం జనగామ రైల్వే స్టేషన్​ను సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనను కలిశారు. జనగామ రైల్వే స్టేషన్​కు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తుంటారని, శాతవాహన, చార్మినార్, షిర్డీ, కోణార్క్​రైళ్లకు జనగామలో హాల్టింగ్​ఇవ్వడం వల్ల వారికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. రైల్వేస్టేషన్ సందరీకరణ పనులు వేగవంతం చేయాలని కోరారు. 

స్పందించిన జీఎం ఇక్కడ రైళ్లు ఆపాలని అధికారులకు సూచించారు. నాయకులు బొమ్మకంటి అనిల్, పెద్దోజు జగదీశ్, తోకల హరీశ్, రవి రాజా, చంద్రం, లగిశెట్టి వీరలింగం, శివకృష్ణ, కాసుల శ్రీను, పానుగంటి శ్రీనివాస్ తదితరులున్నారు.