
కౌన్ బనేగా కరోడ్ పతి షోలో రూ.కోటి రూపాయల ప్రశ్న డెలివరీ బాయ్ ను వరించింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీలో మధ్యప్రదేశ్‌కి చెందిన విజయ్ పాల్ సింగ్ రాథోడ్ కు అవకాశం దక్కింది. మద్యతరగతి కుటుంబానికి చెందిన విజయ్ కి పోలీస్ అధికారి కావాలనే లక్ష్యంతో ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూ కుటుంబ పోషణ కోసం కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.8 వేల శాలరీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
తాజాగా కేబీసీలో పాటిస్పెట్ చేసే అవకాశం రావడంతో ..ఆ షోలో అమితాబ్ వేస్తున్న ప్రశ్నలకు అద్భుతంగా రిప్లయి ఇస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రోజు జరిగే షోలో కోటి రూపాయల ప్రశ్నను ఎదుర్కోనున్నాడు.
ఈ సందర్భంగా విజయ్ పాల్ సింగ్.., హీరోయిన్ కియారా అద్వానీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కియారాపై చాలా కాలంగా క్రష్ ఉందని..ఆమెను ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయట పెట్టాడు.