హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కేబీఆర్ చుట్టూ చేపట్టిన పనులు స్పీడందుకున్నాయి. 10 రోజుల కింద పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కార్మికులు తరలివెళ్లినా, వేరే ప్రాజెక్టుల నుంచి లేబర్ ను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నారు.
ప్రాజెక్టుకి సంబంధించి పార్క్ హయత్ సమీపంలో పిల్లర్లు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఫౌండేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. అగ్రసేన్ విగ్రహం, క్యాన్సర్ హాస్పిటల్ ఏరియాలో అండర్ పాస్ పనులు మొదలుపెట్టారు.
